పరకాల: ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఓసీ జేఏసీ జాతీయ రాష్ట్ర అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపునిచ్చారు. పరకాలలోని ఆర్‌ఆర్ గార్డెన్‌లో శుక్రవారం సాయంత్రం ఓసీ జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కోసం సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్ ఆరోరా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ నుంచి చేపట్టిన దేశ వ్యాప్త రథయాత్రకు ఓసీ జేఏసీ, బహుజన కులసంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26న జనగామ, హనుమకొండ మీదుగా పరకాలకు సా యంత్రం చేరుకుంటుందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు గోపు జయపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఓసీ, జేఎసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు చందుపట్ల నర్సింహారెడ్డి, ప్రచార కార్యదర్శి కామిడి సతీశ్‌రెడ్డి, మేడ్చల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పైళ్ల హరినాథ్, కొలుగూరి రాజేశ్వర్‌రావు, ఐలినేని మల్లికార్జురెడ్డి, బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కన్నం లక్ష్మణ్, పరకాల ఓసీ జేఏసీ నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఓసీ ఐకాస ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు ఉన్నారు.
ఓసీ జేఏసీ జాతీయ రాష్ట్ర అధ్యక్షుడు పోలాడి రామారావు


