ప్రజాసేవే పోలీసుల ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

ప్రజాసేవే పోలీసుల ధ్యేయం

Oct 10 2026 1:34 AM | Updated on Oct 10 2026 1:34 AM

భీమదేవరపల్లి: ప్రజాసేవే పోలీసుల ధ్యేయమని, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత స్పష్టం చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆమె ముల్కనూరు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. సీపీ శ్వేతకు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత పూలమొక్క అందించి స్వాగతం పలికారు. ఎస్సై ఎం.రాజు నేతత్వంలో సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్టేషన్‌ పరిధి వివిధ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్‌ కేసులు, స్టేషన్‌ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను సీపీ పరిశీలించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్‌ మాట్లాడుతూ.. న్యాయం కోసం వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి, సమస్యలను పరిష్కరించి వారి మన్ననలు పొందాలని సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆమె మామిడి మొక్క నాటారు. కార్యక్రమంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ధార కవిత, కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్‌రెడ్డి, ఎల్కతుర్తి సీఐ కె.శ్రీను, స్థానిక ఎస్సై ఎం. రాజుతో పాటు స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

వరంగల్‌ సీపీ శ్వేత

ముల్కనూరు పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement