● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రొఫెసర్ జయశంకర్ అలుపెరగని పోరాటం చేశారని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కొనియాడారు. పట్టణంలోని మల్లంపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని కార్యనిర్వాహకుడు కురిమిళ్ల సుదర్శనచారి ఆధ్వర్యంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలంగాణ పౌరులకు జరిగిన అవమానాన్ని భరించలేక తెలంగాణ సాకారం కోసం శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. సోనియాగాంధీతో సైతం చర్చించి సబ్బండ వర్గాలను ఏకంచేసి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన మహనీయుడు జయశంకర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి, కౌన్సిలర్లు బీరం భరత్‌రెడ్డి, శ్రీరామోజు రోజారాణి, విజయ్‌కుమార్, వేముల సాంబయ్యగౌడ్, బీరం రవీందర్‌రెడ్డి, బత్తిని రాజేందర్, కె.బ్రహ్మచారి, కుదురుపాక జగదీశ్వర్‌చారి, మొగులోజు కోటిలింగాచారి, కొనుగోటి రవీంద్రచారి, కృష్ణుడు, రమేష్, వాసు, సుధాకర్, రమణాచారి, వీరాచారి, లక్ష్మిపతి పాల్గొన్నారు.


