యోగా సాధనతో ఏకాగ్రత పెంపు | - | Sakshi
Sakshi News home page

యోగా సాధనతో ఏకాగ్రత పెంపు

Jun 22 2026 1:06 AM | Updated on Jun 22 2026 1:06 AM

ఖిలా వరంగల్‌: ప్రపంచానికి తమ దేశం అందించిన అమూల్యమైన జీవన విధానమే యోగా అని, వేగవంతమైన జీవన విధానంలో యోగా సాధనతో ఆరోగ్యం, శారీరక, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత లభిస్తుందని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద తెలిపారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మధ్యకోటలోని నాలుగు కీర్తితోరణం ప్రాంగణంలో ఆయూష్‌ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా కలెక్టర్‌ సత్యశారద, కుడా చైర్మన్‌ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఎర్ర ప్రియాంక, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి హాజరై 500 మంది విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్‌ ఆర్డీఓ సుమ, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, డీఆర్వో విజయలక్ష్మి, తహసీల్దార్లు ఇక్బాల్‌, శ్రీకాంత్‌, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి పుష్పలత, డీపీఆర్వో ప్రేమలత, జిల్లా నోడల్‌ అధికారి మైదం రాజు, డిప్యూటీ నోడల్‌ అధికారి లత, డాక్టర్‌ అమృతవల్లి, డాక్టర్‌ మంజుల, జిల్లా కన్వీనర్‌ డాక్టర్‌ రాజేందర్‌, తదితరులు పాల్గొన్నారు. – మరిన్ని ఫొటోలు 9లో

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement