పరీక్ష కేంద్రాల తనిఖీ..
ఆర్ట్స్ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద సీపీ సన్‌ప్రీత్‌సింగ్
హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష తీరును పరిశీలిస్తున్న కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
సీకేఎం డిగ్రీ అండ్ పీజీ కళాశాల వద్ద
విద్యార్థినితో మాట్లాడుతున్న పోలీసులు
హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రం వద్ద ఇయర్ రింగ్ తీస్తున్న విద్యార్థిని, 4 రోజుల క్రితం యాక్సిడెంట్‌లో గాయపడ్డ కవితను పరీక్ష హాల్లోకి తీసుకొస్తున్న పోలీస్ సిబ్బంది
విద్యార్థులను తనిఖీ చేసి కేంద్రంలోకి పంపిస్తున్న పోలీసు సిబ్బంది
హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని నీట్ పరీక్ష కేంద్రాన్ని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించారు. నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని నీట్ పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్త్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం పరిశీలించారు. అదేవిధంగా అదనపు కలెక్టర్ రవి, వరంగల్ అదనపు కలెక్టర్ గణేశ్, నీట్ సిటీ నోడల్ అధికారి ఆర్.భిక్షపతి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. వరంగల్‌లోని సీకేఎం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు.
● పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీగా బందోబస్తు
● ఆలస్యంగా వచ్చిన ఇద్దరికి అనుమతి నిరాకరణ
● సీసీ కెమెరాల నిఘాలో పరీక్ష నిర్వహణ
● హనుమకొండ, వరంగల్‌లో 4,195 మంది హాజరు
89.71 శాతం మంది అభ్యర్థులు హాజరు
కేయూ క్యాంపస్/వరంగల్ క్రైం/కాశిబుగ్గ: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష (నీట్) ప్రశాంతంగా ముగిసింది. హనుమకొండ, వరంగల్, కాజీపేట (ట్రైసిటీ)లో ఏర్పాటు చేసిన 13 పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు నీట్ పరీక్ష నిర్వహించారు. దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా గంటపాటు సమయం ఇచ్చారు. ఉదయం 11 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసేశారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పరీక్ష కేంద్రానికి మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత వచ్చిన ఇద్దరు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. నీట్‌కు 13 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 4,676 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 4,195 మంది 89.71 హాజరైనట్లు నీట్ జిల్లా కో–ఆర్డినేటర్ భిక్షపతి తెలిపారు.


