ఎస్‌ఐఆర్‌లో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌లో భాగస్వాములు కావాలి

Jun 22 2026 1:06 AM | Updated on Jun 22 2026 1:06 AM

ఎస్‌ఐఆర్‌లో భాగస్వాములు కావాలి

వరంగల్‌ చౌరస్తా : ఎస్‌ఐఆర్‌లో భాగస్వాములు కావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు పిలుపునిచ్చారు. వరంగల్‌ ఐడీఓసీ నుంచి కాశిబుగ్గ సర్కిల్‌ వరకు ఆదివారం 2కే రన్‌, మానవహారాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధ్యక్షత వహించగా హనుమకొండ కలెక్టర్‌, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్‌ బాజ్‌పాయ్‌, కూడా చైర్మన్‌ ఇనుగాల వెంకట్రాంరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు జెండా ఊపి 2కే రన్‌ ప్రారంభించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో పాలనను నిర్ణయించే గొప్ప అవకాశమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌కు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. అదనపు కలెక్టర్‌ జి.సంధ్యారాణి, వరంగల్‌ ఆర్డీఓ సుమ, స్వీప్‌ నోడల్‌ ఆఫీసర్‌ భాగ్యలక్ష్మి, తహసీల్దార్‌ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement