రాష్ట్ర సాధనకు జయశంకర్‌ అలుపెరుగని కృషి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర సాధనకు జయశంకర్‌ అలుపెరుగని కృషి

Jun 22 2026 1:06 AM | Updated on Jun 22 2026 1:06 AM

రాష్ట్ర సాధనకు జయశంకర్‌ అలుపెరుగని కృషి

హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ అలుపెరుగని కృషి చేశారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌ అన్నారు. జయశంకర్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని జయశంకర్‌ స్మృతివనంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి బండా ప్రకాశ్‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌, తెలుగు అకాడమీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. జెడ్పీ మాజీ చైర్మన్‌ సాంబారి సమ్మారావు, హనుమకొండ తహసీల్దార్‌ రవీందర్‌ రెడ్డి, జయశంకర్‌ కుటుంబ సభ్యులు, ఆయా సంఘాలు, పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కూరపాటి వెంకటనారాయణ, హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement