ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ పర్యటన

Jun 21 2026 12:43 AM | Updated on Jun 21 2026 12:43 AM

గీసుకొండ: మండలంలోని పలు గ్రామాల్లో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ ఎన్‌.శ్రుతి శనివారం పర్యటించారు. ఎంపీడీఓ విధులు, బాధ్యతలపై అవగాహన కోసం మండలానికి వచ్చిన ఆమె శాయంపేట హవేలిలోని ప్రాచీన పాంచాలరాయ ఆలయం, కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలను సందర్శించారు. వాటి చారిత్రక ప్రాధాన్యం, పూజా కార్యక్రమాలను గురించి తెలుసుకున్నారు. విశ్వనాథపురంలో ఏర్పాటు చేసిన బాలల గ్రామ సభలో పాల్గొన్నారు. బాల్యం నుంచే ప్రజాస్వామ్య ప్రక్రియ, విధానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సర్పంచ్‌లు కన్నెబోయిన యమున, దారవత్‌ జ్యోతి, గాలి యాకయ్య, పంచాయతీ కార్యదర్శులు మురళీకృష్ణ, శ్రీధర్‌, సునీల్‌, అర్చకులు రామాచార్యులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement