న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026
జీవిత సారం తెలిపే గురువు. కష్టాల్లో ధైర్యం నూరిపోసే వైద్యుడు. మన తరఫున వాదించే లాయర్. భవిష్యత్‌ను నిర్మించే ఇంజినీర్. నిత్యం రక్షణ కల్పించే పోలీస్. వాస్తవాలు తెలిపే జర్నలిస్ట్. ఆకలి తీర్చే రైతు. ఇలా ఎన్ని పాత్రల్లో అయినా ఒదిగిపోయే రియల్ హీరో నాన్న.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు రియల్ హీరోల
గురించి నేడు (ఆదివారం) ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.
నేడు ఫాదర్స్ డే
వరంగల్ క్రైం: ‘ఆడపిల్లలకు నాన్నే ధైర్యం. నాన్నంటే ఒక నమ్మకం. ఏదైనా సరే తనే చూసుకుంటాడనే ఒక భరోసా. ఇది ఏ ఆడపిల్లకై నా తండ్రి నుంచి స్వేచ్ఛగా లభించే చనువు. ఉద్యోగ సాధనకు మా నాన్నే స్ఫూర్తి’ అంటున్నారు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత. ఫా దర్స్‌డే సందర్భంగా తన తండ్రి గురించి ఆమె చెప్పిన మాటల్లోనే..
ప్రజలతో మమేకమై..
మానాన్న దార సాంబయ్య. ప్రకాశం జిల్లాలోని మట్టి గుంట గ్రామం. తెలుగు అధ్యాపకుడిగా జీవితం ప్రారంభించి.. ఆ తర్వాత గ్రూప్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్‌గా యూనిఫామ్ సర్వీస్‌లోకి ప్రవేశించారు. వివిధ హోదాలో పనిచేసి ఎకై ్సజ్ డీఐజీగా స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ స్ఫూర్తితో 2004–09లో సొంత నూతలపాడు (ఎస్‌ఎన్‌పాడు) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రజలతో మమేకమై వారికి సేవలందించారు. మేం నలుగురం ఆడ పిల్లలం అయినప్పటికీ ఎక్కడా మగ పిల్లలకు తీసిపోకుండా పెంచారు. ధైర్యంగా సమాజంలో ఎదిగేందుకు అవసరమైన స్వేచ్ఛ, అవకాశాలు కల్పించారు. ముఖ్యంగా ఓనమాల నుంచి ధైర్యం, నిజాయితీని నేర్పించారు. అమ్మ పద్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కావడంతో క్రమశిక్షణతో కూడిన జీవితం అలవాటైంది. ఉద్యోగం, కుటుంబం, ఆర్యోగం, సేవా వీటిని సమపాళ్లలో చూడడం నాన్న నుంచి నేర్చుకున్నా.
సమయం కేటాయించేవారు..
నాన్న వివిధ హోదాల్లో పనిచేసినప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించేవారు. సమాజంలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు వివరించేవారు. నా మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండడంతో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతానంటే నాన్న ప్రోత్సహించారు. ఇంట్లో నలుగురం ఆడపిల్లలం కాబట్టి అక్క పెళ్లి తర్వాత నాకు పెళ్లి చేయాల్సి వచ్చింది. నా ఇష్టానికి అనుగుణంగా పెళ్లి తర్వాత నేను చదువుకునేలా మా వారిని ఒప్పించారు. నాన్న స్ఫూర్తి, భర్త ప్రోత్సాహం ఈ రెండు నేను గ్రూప్–1 సాధించేందుకు దోహదపడ్డాయి. బాధితులకు, పేదలకు ఎలా సేవా చేయవచ్చో నాన్నను చూసి నేర్చుకున్నా. పేదలకు, బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు పోలీస్ శాఖ ఒక చక్కటి వేదిక. అన్యాయం జరిగిందని వచ్చే వారికి న్యాయం జరిగేలా చూసిన ప్రతీసారి నాన్నే గుర్తుకు వస్తారు. ఆయన చెప్పిన ‘సత్యమే మనల్ని కాపాడుతుంది.. సత్యం వైపు మాత్రమే ఉండాలి’ అనే మాటలు గుర్తొస్తాయి. నాకు మా నాన్నే హీరో.
గెలుపు వెనుక దాగిన నాన్న స్వేదం
సాక్షితో సెంట్రల్ జోన్
డీసీపీ దార కవిత


