ఖిలా వరంగల్: ఫిట్‌నెస్ లేని, నిబంధనలు పాటించిన ప్రైవేట్ స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝలిపిస్తున్నారు. నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా మూడు రోజుల్లో 20 స్కూల్ బస్సులను గుర్తించి సీజ్‌చేసి భారీ జరిమానాలు విధించారు. రానున్న రోజుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టి ఆర్టీఏ నిబంధనల పాటించని బస్సులపై జరిమానాలు విధిస్తామని ఆర్టీఓ రంగారావు హెచ్చరించారు. విద్యార్థుల రవాణా కోసం వినియోగించే వాహనాలు అన్ని నిబంధనలు పాటించాలని, పూర్తిస్థాయి సామర్థ్యంతో ఉండాలని సూచించారు. వరంగల్ డీటీసీ సురేష్‌రెడ్డి ఆదేశాల ప్రకారం స్పెషల్ డ్రైవ్‌లో ఎంవీఐలు వేణుగోపాల్‌రెడ్డి, శోభన్‌బాబు, శ్రీనివాస్, కె.శ్రీనివాస్, ఏఎంవీఐలు ఉదయ్‌కుమార్, నరేందర్, శంకర్, హారిక, అఫీరొజ్జిద్దీ న్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


