ఆత్మకూరు: యువకుడిపై దాడిచేసిన నిందితులను అరెస్టు చేసినట్లు పరకాల ఏసీపీ సతీశ్‌బాబు తెలిపారు. ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో గురువారం నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. హనుమకొండలోని శంకరనగర్ కాలనీకి చెందిన సంగాని సూర్యకిరణ్‌వర్మ, ఆకారపు ప్రవీణ్‌కుమార్ వాహనాలను తాకట్టుపెట్టి అప్పు తీసుకున్నారు. డబ్బులు చెల్లించకుండా మోసం చేస్తూ వాహనాలను తిరిగి తెచ్చుకునే వారు. ఈక్రమంలో మండల కేంద్రానికి చెందిన గౌని శ్రీకాంత్ అనే యువకుడి వద్ద వాహనాన్ని తాకట్టుపెట్టి రూ.2 లక్షలు అప్పు తీసుకున్నారు. తర్వాత మరో అద్దె వాహనాన్ని ఐద అనిల్‌కుమార్ వద్ద తీసుకొని తాకట్టుపెట్టి డబ్బు తీసుకున్నారు. తర్వాత శ్రీకాంత్‌కు ఐద అనిల్‌కుమార్ ఫోన్‌చేసి ఈనెల 10న డబ్బుతో వస్తున్నామని చెప్పాడు. అనిల్‌కుమార్, రాయరాకుల కల్యాణ్, కిన్నెర బన్నీ, రామారపు శివసాయి, పోలెపాక రాహుల్, పోతరాజు గౌతమ్‌కుమార్, తాళ్ల నిహాల్ మూడు కార్లలో వచ్చి గూడెప్పాడ్ సమీపంలోని ఓ హోటల్ వద్ద శ్రీకాంత్‌తో మాట్లాడారు. డబ్బులు ఇస్తేనే వాహనం ఇస్తానని శ్రీకాంత్ చెప్పాడు. ఈవిషయాన్ని వారు సంగాని సూర్యకిరణ్, ఆకారపు ప్రవీణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. శ్రీకాంత్‌ను బలవంతంగా కారులో కిడ్నాప్ చేసి దాడిచేసి బెదిరించాలని వారు ఆదేశించారు. దీంతో మండల కేంద్రంలోని ఓ బేకరి వద్ద ఆగి డబ్బులు ఇస్తామని శ్రీకాంత్‌ను పిలిపించారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం శ్రీకాంత్‌ను నిందితులు కారులోకి లాగి దాడి చేశారు. అక్కడి నుంచి కోమటిపల్లి టోల్‌గేట్ సమీపంలో కొండవద్దకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. చివరకు కేయూసీ పోలీస్‌స్టేషన్ వద్ద వదిలివెళ్లారు. దీంతో బాధితుడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితులను పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ సతీశ్‌బాబు తెలిపారు. నిందితుల్లో పోతరాజు గౌతంకుమార్, తాళ్ల నిహాల్ పరారీ లో ఉన్నారని తెలిపారు. నిందితుల నుంచి రెండు కార్లు, 2 ఐ ఫోన్లు, రూ.3వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ సతీశ్‌బాబు పేర్కొన్నారు. ఆయన వెంట సీఐ సంతోష్, ఎస్‌ఐ తిరుపతి సిబ్బంది ఉన్నారు.
డబ్బు అడిగినందుకు యువకుడిపై దాడి
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
వివరాలు వెల్లడించిన
ఏసీపీ సతీశ్‌బాబు


