వరంగల్‌ ఆర్వోలో ప్రొహిబిషన్‌ అధికారులు | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌ ఆర్వోలో ప్రొహిబిషన్‌ అధికారులు

Jun 19 2026 2:12 AM | Updated on Jun 19 2026 2:12 AM

కాజీపేట అర్బన్‌: వరంగల్‌ ఆర్వోలో ట్రైనీ(ప్రొహిబిషన్‌) సబ్‌ రిజిస్ట్రార్లు దస్తావేజుల రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారు. ఈ కార్యాలయంలో నలుగురు సబ్‌ రిజిస్ట్రార్లు ఉన్నారు. సాధారణంగా ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు ప్రతిరోజూ 108 స్లాట్స్‌కు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు. రెండు నెలల క్రితం ఇద్దరు ఏసీబీకి చిక్కడంతో ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా సైదులు కొనసాగుతున్నారు. ఇటీవల గ్రూప్‌–2లో ఎంపికైన ఇద్దరు అధికారులు పీఎస్‌ఆర్‌(ప్రొహిబిషన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌)లుగా , గ్రూప్‌–1 ద్వారా ఎంపికై న మరో అధికారి ప్రొహిబిషన్‌ రిజిస్ట్రార్‌(పీడీఆర్‌)గా పనిచేస్తున్నారు.

రెండెన్నర నెలలపాటు విధులు..

రెండున్నర నెలలకు వరంగల్‌ ఆర్వోలో ఇద్దరు పీఎస్‌ఆర్‌లుగా, ఒకరు పీడీఆర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రొహిబిషన్‌ సబ్‌ రిజిస్ట్రార్లు మధు, జితేందర్‌, ప్రొహిబిషన్‌ జిల్లా రిజిస్ట్రార్‌ దీపక్‌ గురువారం సాక్షితో తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రొహిబిషన్‌ పీరియడ్‌ వరంగల్‌ ఆర్వోలో నిర్వహించడం విధుల పట్ల అవగాహన వస్తోందని తెలిపారు. ప్రతీ దస్తావేజును పరిశీలించడం, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నేర్చుకోవడమే కాగా రిజిస్ట్రేషన్లను సైతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడ ఎక్కువ శాతం మార్టిగేజ్‌, సేల్‌ డీడ్‌లు వస్తున్నాయని తెలిపారు. స్లాట్‌ బుకింగ్‌ సమయానికి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి దస్తావేజుదారులకు పత్రాలను అందిస్తున్నామని చెప్పారు. పోస్టింగ్‌ పొందిన తర్వాత ఇక్కడ నేర్చుకున్న అంశాలు తమకు ఎంతో తోడ్పడుతాయని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement