● మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,
ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి
పరకాల: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడారు. వారికి అందుతున్న సౌకర్యాలు, ఉపాధి అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పడిదెల దీప్తి, దుబాసి వెంకస్వామి, బీఆర్‌ఎస్ నాయకులు కొక్కిరాల రాకేశ్‌రావు, బొచ్చు బాపురావు తదితరులున్నారు.
కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాల పరిశీలన
నడికూడ: మండలంలోని రామకృష్ణపూర్, ధర్మారం, పులిగిల్ల గ్రామాల్లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలను బుధవారం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. వారి వెంట బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.


