వరంగల్ అర్బన్: అర్హులైన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా అందరూ సహకరించాలని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌ఓ), జీడబ్ల్యూఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. బుధవారం వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఈఆర్‌ఓ మాట్లాడుతూ.. ఓటర్ల సందేహాల నివృత్తి కోసం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఈఆర్‌ఓ కార్యాలయం, సంబంధిత తహసీల్దార్ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో తహసీల్దార్లు మహ్మద్ ఇక్బాల్, శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ సుభాన్, వివిధ పార్టీల నాయకులు రాజేశ్, రఘునారెడ్డి, బాబు, సీతారాం, సయ్యద్ సుల్తాన్ సాధిక్, రజనీకాంత్, సుభాన్, ఫైజుల్దీన్, శ్యామ్ పాల్గొన్నారు.
ఈఆర్‌ఓ, హనుమకొండ
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
రాజకీయ పార్టీల ప్రతినిధులతో
సమావేశం


