విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి

Jun 17 2026 12:52 AM | Updated on Jun 17 2026 12:52 AM

విద్యారణ్యపురి: ‘వేసవి సెలవుల్లో ఎలా గడిపారు? మీ అనుభవాలు ఏంటి? వేసవి శిబిరాలు వినియోగించుకున్నారా? ఏమైనా ఆటలు ఆడారా? చదువుకున్నారా’ అని హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ పాఠశాల పదో తరగతి విద్యార్థులను కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ప్రశ్నించారు. మంగళవారం ఆమె స్కూల్‌ను సందర్శించి పదో తరగతి విద్యార్థులతో ఇంటారాక్ట్‌ అయ్యారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు, అందుతున్న వసతులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ కోసం అదనపు తరగగతి గది కావాలని, హిందీ సబ్జెక్టుకు ఒక టీచర్‌ అవసరం ఉందని హెచ్‌ఎం రామరావు కలెక్టర్‌ను కోరారు. డీఈఓ ఎల్‌వీ.గిరిరాజ్‌గౌడ్‌ హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ మర్కజీ హైస్కూల్‌ ఆవరణలోని ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతి గదిలో చిన్నారులు ఏం నేర్చుకుంటున్నారో పరిశీలించారు. మరో ఇద్దరు టీచర్లు అవసరం ఉందని ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం సంగెం శ్రీనివాస్‌.. డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. డీఈఓ వెంట ప్లానింగ్‌ కో–ఆర్డినేటర్‌ బి.మహేశ్‌ ఉన్నారు.

18న 2కే రన్‌

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం–2026 (ఎస్‌ఐఆర్‌)పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈనెల 18న ఉదయం 7 గంటలకు 2కే రన్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. హనుమకొండ అదాలత్‌ సర్కిల్‌లోని డీఈఓ కార్యాలయం వద్ద ప్రారంభమయ్యే ఈ రన్‌ కలెక్టరేట్‌ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌

ప్రభుత్వ మర్కజీ టెన్త్‌ విద్యార్థులతో

ఇంటరాక్షన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement