నిషేధిత కలుపు మందులు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

నిషేధిత కలుపు మందులు స్వాధీనం

Jun 17 2026 12:52 AM | Updated on Jun 17 2026 12:52 AM

నిషేధిత కలుపు మందులు స్వాధీనం

పోలీసుల అదుపులో ఫర్టిలైజర్‌

యజమాని

కమలాపూర్‌: మండలంలోని అంబాలలోని శ్రీరామ ఫర్టిలైజర్స్‌, పెస్టిసైడ్స్‌ దుకాణంపై మంగళవారం వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. రూ.57,665 విలువైన ప్రభుత్వ నిషేధిత కలుపు సంహారక మందులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ఎ.మధుసూదన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అంబాలలోని శ్రీరామ ఫర్టిలైజర్స్‌, పెస్టిసైడ్స్‌ దుకాణంలో ప్రభుత్వ నిషేధిత కలుపు సంహారక మందులు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా విక్రయించడానికి నిల్వ ఉంచిన రూ.57,665 విలువైన ప్రభుత్వ నిషేధిత గ్‌లైఫోసేట్‌, గ్‌లైడాన్‌, పారాక్వాట్‌ పేర్లతో విక్రయించే కలుపు సంహారక మందులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సీజ్‌ చేసి కలుపు మందులతో పాటు ఫర్టిలైజర్స్‌, పెస్టిసైడ్స్‌ యజమాని కుక్కల ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల నిమిత్తం కమలాపూర్‌ పోలీసులకు అప్పగించారు. తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.బాబూలాల్‌, ఎస్సై కె.సుధాకర్‌, టాస్క్‌ఫోర్స్‌, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement