కాలం చెల్లిన పురుగు మందులు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

కాలం చెల్లిన పురుగు మందులు స్వాధీనం

Jun 17 2026 12:46 AM | Updated on Jun 17 2026 12:46 AM

నర్సంపేట రూరల్‌: నర్సంపేట పట్టణంలోని రెండు షాపుల్లో పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌, వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం దాడులు చేసినట్లు ఎస్సై గూడ అరుణ్‌ తెలిపారు. రూ. 42,433 విలువగల కాలం చెల్లిన పురుగు మందులను సీజ్‌ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మల్లంపల్లి రోడ్డులో కారుకూరి భరత్‌కు చెందిన ఆగ్రో ఏజెన్సీస్‌లో రూ.12193, నెక్కొండ రోడ్డులో ఎండీ కరీంకు చెందిన జై కిసాన్‌ ఫర్టిలైజర్‌ షాపులో రూ. 30,240 విలువైన కాలం చెల్లిన పురుగు మందులను సీజ్‌ చేసినట్లు తెలిపారు. యజమానులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement