న్యూశాయంపేట: వర్షాకాలంలో సహజ విపత్తుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. గత వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల సమస్యలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, గృహాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆరోగ్యశాఖకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఓటరు జాబితాలో అర్హులను నమోదుచేయాలి
అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్స్‌తో మూడు నియోజకవర్గాల పరిధిలోని ఏఈఆర్‌ఓఎస్, ఎఎల్‌ఎంటీలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 17 నుంచి 20 వరకు బీఎల్‌ఓలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 26 నుంచి జూలై 24 వరకు జరిగే ప్రత్యేక సమగ్ర సవరణలో ప్రతి బీఎల్‌ఓ తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి డిక్లరేషన్ ఫారాలు పంపిణీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు.
అధికారుల సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద


