కాశిబుగ్గ: జిల్లాలో ఈ నెల 28న పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.సాంబశివరావు తెలిపారు. వరంగల్ ఐఎంఏ హాల్‌లో వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, సబ్‌యూనిట్ ఆఫీసర్లకు పల్స్‌పోలియో ప్రోగ్రాం, జాతీయ నులిపురుగుల నిర్మూలనపై మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 0–5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయాలని సూచించారు. 28న పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు 29, 30 తేదీల్లో గృహ సందర్శన చేపట్టి పోలియో టీకాలు ఇస్తారని పేర్కొన్నారు. నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా జూలై 13న ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు వారికి ఆల్బెండజోల్ మాత్రలను అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో నోటి ద్వారా ఇవ్వాలని సూచించారు. జూలై 18న మాప్ ఆఫ్ డే నిర్వహిస్తామని వివరించారు. వర్షాకాలం దృష్టా ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర మందులు, యాంటీవీరం లాంటివి అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. వ్యాధులు ప్రబలే ప్రాంతాల్లో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వివరించారు. ప్రోగ్రాం ఆఫీసర్లు ఐ.ప్రకాశ్, సయ్యద్ ఇక్తధార్ అహ్మద్, రాజమౌళి, సాజిదా, అరుణ్ జోషి, విజయ్‌కుమార్, డీఎంఓ రజని పాల్గొన్నారు.
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.సాంబశివరావు


