వరంగల్ జిల్లాలో..
జిల్లాలోని స్కూళ్లకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు
భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్‌లోని పాఠశాల భవనం, వ ర్లీ రంగులతో ఆకట్టుకుంటున్న న్యూశాయంపేటలోని పోచంపల్లి ప్రాథమిక పాఠశాల
విద్యారణ్యపురి: వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. సోమవారం నుంచి అన్ని విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లాలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లనున్నారు. క్లాత్ రానందున ప్రస్తుతం యూనిఫామ్ అందించే పరిస్థితి లేదు. పాఠశాలల పునఃప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందించడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, రాగి జావా, మధ్యాహ్న భోజనం అందించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
జిల్లాకు 2,56,180 పాఠ్యపుస్తకాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో గతంలోకంటే ఎక్కువ శాతం పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. అక్కడక్కడ కొన్ని పాఠశాలల్లో గతంలో మన ఊరు–మన బడి కింద మిగిలిన పనులు పూర్తి కావాల్సి ఉంది. జిల్లాలోని పాఠశాలలకు (పార్ట్ 1) 2,56,180 పాఠ్యపుస్తకాలు వచ్చాయి. హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణం అంసంపూర్తిగా ఉండగా.. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.8 లక్షల 90 వేలు కేటాయించడంతో ఆ డైనింగ్ హాల్ నిర్మాణం పూర్తి కావొస్తోంది. జిల్లాలో పీఎం శ్రీస్కూళ్లు 19 ఉండగా అందులో 16 స్కూళ్లలో గత విద్యాసంవత్సరంలో వివిధ వసతుల కల్పనకు కార్యక్రమాల అమలుకు ఒక్కో స్కూల్‌కు లక్షల్లో నిధులు విడుదలయ్యాయి. 38 పాఠశాలల్లో అదనపు టాయిలెట్స్ అవసరం ఉన్నట్లు గుర్తించారు. మరో 13 చోట్ల మరమ్మతులు చేయాలని ప్రతిపాదించారు. జిల్లాలో కిచెన్ షెడ్లు కావాలని ఆరు పాఠశాలల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి.
క్లాత్ రాకపోవడంతో ప్రస్తుతం విద్యార్థులకు అందని యూనిఫామ్
బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలుకు విద్యాశాఖ అధికారుల ఏర్పాట్లు
నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
జిల్లాలో 39 ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించనున్నారు. 39 మంది ఇన్‌స్ట్రక్టర్లను, 39 మంది ఆయాలను నియమించనున్నారు.
భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్యలో టాప్‌గా నిలిచింది. ప్రస్తుతం అక్కడ 571 మంది చదువుతున్నారు. వ్యాపార వేత్త భాస్కర్‌రావు ఆర్థిక సహకారంతో నాణ్యమైన, డిజిటల్ విద్య అందుతోంది. రవాణా సదుపాయం కోసం బస్సులు కూడా ఆయన ఏర్పాటు చేశారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్, మర్కజీ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి. అత్యుత్తమ విద్యాబోధన, పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం పెరగడమే ఇందుకు కారణం. అదేవిధంగా జిల్లాలోని ఒంటిమామిడిపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూ ల్‌లోనూ మౌలిక వసతులు, విద్యాబోధన, ఉత్తీర్ణతా శాతం తదితర కారణాలతో అడ్మిషన్లకు డిమాండ్ ఉంది.
సాక్షి, వరంగల్/కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించేందుకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుదీర్ఘ విరామం తర్వాత (నేడు) సోమవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు కొత్త ఉత్సాహంతో బడిబాట పట్టనున్నారు. తొలి రోజే విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు పాఠశాల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. కాగా, తొలి రోజే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తొలి రోజే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచే దిశగా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఈనెల 11వ తేదీ నాటికి 1,759 మంది విద్యార్థులు ఎన్‌రోల్‌మెంట్ చేసుకోగా బాలికలు 831 మంది, బాలురు 928 మంది విద్యార్థులు ఉన్నారు. 19 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు.


