మలివయస్సులో పిల్లల్లా మారారు! | - | Sakshi
Sakshi News home page

మలివయస్సులో పిల్లల్లా మారారు!

Jun 15 2026 7:28 AM | Updated on Jun 15 2026 7:28 AM

మలివయస్సులో పిల్లల్లా మారారు!

హన్మకొండ చౌరస్తా: ములుగు జిల్లా కేంద్రంలో 1974–76 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్‌ చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం హనుమకొండలో ఒకే వేదికపై కలుసుకున్నారు. 50 ఏళ్ల తర్వాత ఒకే చోట చేరిన వారంతా ఆనాడు విద్యార్థిగా గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈసందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వారంతా ఆనందంగా గడిపారు. ఉద్యోగం, కుటుంబం, కష్టసుఖాలను ఒకరికొకరు పాలుపంచుకున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సమ్మేళనాలను నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు. మరణించిన తోటి స్నేహితులు, అధ్యాపకులకు శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో అధ్యాపకులు భిక్షపతి, మోహన్‌సింగ్‌, సారంగపాణి, నిర్వాహకులు వై.కృష్ణారెడ్డి, సుధాకర్‌, మార్త రమేశ్‌బాబు, అకినెపల్లి ఓంప్రకాశ్‌, రాజేశ్వర్‌రావు, రాజమౌళి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

50 ఏళ్ల తర్వాత కలుసుకున్న

పూర్వ విద్యార్థులు

జ్ఞాపకాలు గుర్తు చేసుకుని సందడి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement