మోదీ పాలన స్వర్ణయుగం | - | Sakshi
Sakshi News home page

మోదీ పాలన స్వర్ణయుగం

Jun 14 2026 11:49 AM | Updated on Jun 14 2026 11:49 AM

మోదీ పాలన స్వర్ణయుగం ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సంతోశ్‌రెడ్డి

నయీంనగర్‌: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిపై బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి ఆధ్వర్యంలో హంటర్‌ రోడ్డు వేద బ్యాంక్వెట్‌ హాల్లో కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్‌ గాంధే మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్దిక వ్యవస్థగా ఎదిగే దిశగా పయనిస్తోందని తెలిపారు. మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ ఓటమి తెలియని నాయకుడని, ఒక్క రోజు కూడా సెలవు తీసుకుకోకుండా దేశసేవలో నిమగ్నమై ఉన్నారని కొనియాడారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు పద్మ, నాయకులు డాక్టర్‌ కాళీప్రసాద్‌, పులి సరోత్తంరెడ్డి, కందగట్ల సత్యనారాయణ, సండ్ర మధు, నర్మెట్ట శ్రీనివాస్‌, సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.

కమలాపూర్‌: రైతులంతా తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయ్‌ చంద్ర సూచించారు. మండలంలోని మర్రిపల్లిగూడెం, మాదన్నపేట గ్రామాల్లో నమోదు చేస్తున్న ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాలను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు విత్తనాలు వేయకుండా వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ సాగు పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమాల్లో ఏఓ బి.వేణు, ఏఈఓలు జయప్రకాశ్‌, ప్రతాప్‌, ఆయా గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement