పరకాల: ప్రత్యేక రాష్ట్రంలో పరకాల అభివృద్ధిపరంగా పరుగులు పెడుతోంది. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాల మంజూరైంది. 2022లో అప్పటి మంత్రి హరీశ్‌రావు రూ.35 కోట్ల నిధులతో ఆస్పత్రి పనులు ప్రారంభించారు. పనులు చివరి దశకు చేరుకొని ప్రారంభోత్సవానికి సిద్ధం ఉంది. అదేవిధంగా 2025లో పీఎం ఉషా స్కీం ద్వారా రూ.5 కోట్లతో డిగ్రీ కళాశాల మంజూరైంది. ఈ విద్యాసంవత్సరం కొత్త కోర్సులతో కళాశాల అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ, పరకాలను అమరవీరుల జిల్లాగా చేయాలనే స్థానిక ప్రజల కోరిక మాత్రం నెరవేరలేదు.


