పోరు సల్పిన ఓరుగల్లు | - | Sakshi
Sakshi News home page

పోరు సల్పిన ఓరుగల్లు

Jun 2 2026 9:49 AM | Updated on Jun 2 2026 9:49 AM

పోరు సల్పిన ఓరుగల్లు

ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమానికి బీజం పడింది ఇక్కడే. దశాబ్దాల కిందటి పోరాటానికి నాయకత్వం వహించిన ముఖ్యులూ ఇక్కడి వారే. ప్రత్యేక పోరులో అసువులుబాసిన ఎక్కువ మందీ ఈ నేల బిడ్డలే. ఉద్యమానికి ఊపిరి పోసి.. పోరు సల్పిన ఓరుగల్లుది తెలంగాణ అధ్యాయంలో కీలకభూమిక. నేడు (మంగళవారం) రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 12 ఏళ్ల తెలంగాణకు ఏర్పాటులో కీలకమైన కొన్ని ఘట్టాలు ‘సాక్షి’ ప్రత్యేకం.

కమలాపూర్‌: 2009 డిసెంబర్‌ 7న కమలాపూర్‌తో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలు పార్టీలకతీతంగా వేలాదిగా కదిలి రావడంతో ఉప్పల్‌ రైల్వే స్టేషన్‌ పరిసరాలు కిక్కిరిశాయి. జై తెలంగాణ నినాదాలు హోరెత్తాయి. మొదట కాజీపేట వైపు వెళ్లే నాగపూర్‌ ప్యాసింజర్‌ రైలును అడ్డుకుని 20 నిమిషాల తర్వాత పంపించారు. ఆ తర్వాత న్యూఢిల్లీకి వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలును, మరో 45 నిమిషాల తర్వాత వచ్చిన కేరళ ఎక్స్‌ప్రెస్‌ను తెలంగాణ ఉద్యమకారులు ఉప్పల్‌ రైల్వే స్టేషన్‌లో అడ్డుకున్నారు. 5 గంటలు గడిచినా రైళ్లు కదలకపోవడంతో కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న మిలటరీ బలగాలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాయి. మిలటరీ బలగాలు, తెలంగాణవాదులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. రైల్వే, సివిల్‌ పోలీసుల జోక్యంతో ఎనిమిది గంటల తర్వాత రాజధాని, కేరళ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అక్కడి నుంచి పంపించారు. ఇలా తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచి చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించింది ఉప్పల్‌ రైల్‌రోకో.

అమరధామం స్ఫూర్తిగా ఉద్యమం

పరకాల: తెలంగాణ మలిదశ పోరాటాలకు పరకాల పట్టణంలోని అమరధామం వేదికగా నిలిచింది. హైదరాబాద్‌ (తెలంగాణ) సంస్థాన్‌ నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో భాగంగా తెలంగాణ 1947 సెప్టెంబర్‌ 2 జరిగిన మరో జలియన్‌ వాలాభాగ్‌ ఘటనను స్ఫూర్తిగా తీసుకొని 2003లో అమరధామం ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ సంస్థాన ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్య్రాలు లభించకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహావేశాలతో ఉద్యమానికి నడుం బిగించినట్లుగానే అమరధామంలో ఏర్పాటు చేసిన విగ్రహాలు నాటి పోరాటాన్ని కళ్లకు కడుతుంటాయి. పరకాల ప్రాంత ప్రజలు అమరధామంలో ఏర్పాటు చేసిన విగ్రహాల స్ఫూర్తిగా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రజా సంఘాలు తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో నాటి తెలంగాణ పోరాట యోధుల త్యాగాలను స్మరించుకుంటూ అమరధామం వద్ద నివాళులు అర్పించి ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

తెలంగాణ ఉద్యమంలో వరంగల్‌ది కీలకభూమిక

స్వరాష్ట్ర పోరాటానికి

బీజం పడింది ఇక్కడే!

తెలంగాణ అమరవీరుల త్యాగాలు

చిరస్మరణీయం

ఉద్యమ ఘట్టాలు

కొన్ని ‘సాక్షి’ ప్రత్యేకం..

Advertisement
 
Advertisement
Advertisement