మెరుగైన వైద్యసేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యసేవలు అందించాలి

May 21 2026 10:19 AM | Updated on May 21 2026 10:19 AM

పర్వతగిరి : ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆరోగ్య సిబ్బందికి పర్వతగిరి పీహెచ్‌సీ హెచ్‌ఈఓ మూసా మహ్మద్‌ కోరారు. మండలంలోని దౌలత్‌నగర్‌లో నిర్వహిస్తున్న యూనివర్సల్‌ ఇమ్యునైజేషన్‌ ప్రోగ్రామ్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఏఎన్‌సీ మొదటి పరీక్షలు, టీడీ టీకాల ప్రక్రియతోపాటు చిన్నారులకు అందిస్తున్న టీకాల నిర్వహణను పరిశీలించారు. టీకాల నిల్వ విధానం, రికార్డుల నమోదు, చిన్నారుల హాజరు వివరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలోని గర్భిణులు, చిన్నారులందరూ టీకా కార్యక్రమాన్ని పూర్తిగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. సకాలంలో టీకాలు వేయిస్తే పిల్లలను ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించొచ్చి చెప్పారు. గర్భిణీలు నిర్ధిష్ట సమయంలో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement