షెల్టర్‌ జోన్‌ | - | Sakshi
Sakshi News home page

షెల్టర్‌ జోన్‌

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

వరంగల్‌
బుధవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2026
కుక్కలకు

విద్యుత్‌ ఏర్పాట్లు పూర్తి

అంత్య పుష్కరాలకు విద్యుత్‌ పనులు పూర్తయ్యాయి. ఈ నెల 21 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు పుష్కరాలు జరుగనున్నాయి.

సాక్షి, వరంగల్‌: వరంగల్‌, హనుమకొండ జిల్లాలతోపాటు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కుక్కల కాట్లు పెరుగుతున్నా.. వాటిని జన సంచారాల నుంచి షెల్టర్‌ జోన్లకు తరలించే విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జంతు సంరక్షణ చట్టం 1960, 2023 ప్రకారం గుంపులుగా ఉన్న కుక్కలపై ఫిర్యాదులు వస్తే వాటిని డాగ్‌ షెల్టర్లకు తరలించి కుటుంబ నియంత్రణ, రేబిస్‌ వ్యాక్సిన్లు ఇచ్చి మళ్లీ అదే ప్రాంతంలో వదిలేస్తున్నామని మున్సిపల్‌, కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు. కొద్ది నెలల క్రితమే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వీధి కుక్కలు జనసమ్మర్థ ప్రాంతాల నుంచి షెల్టర్‌ జోన్లకు తరలించే అంశాన్ని పరిశీలించాలంటూ కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఆదేశాలు వచ్చాయి. దీంతో ఇక్కడ కూడా అమలు జరుగుతుందని భావించారు. అయితే ఈ మార్గదర్శకాలను సవరించాలంటూ కొందరు జంతు ప్రేమికులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో బ్రేక్‌ పడింది.

పిటిషన్ల కొట్టివేత..

ఈ పిటిషన్లను మంగళవారం కొట్టేసిన సుప్రీంకోర్టు.. వీధి కుక్కల నియంత్రణకు తమ గైడ్‌లైన్స్‌ పాటించాలని లేదంటే చర్యలు తప్పవని రాష్ట్రాలను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఏం చేస్తారన్నది చూడాలి. ఎందుకంటే వరంగల్‌, హనుమకొండ జిల్లాలో ఐదు నెలల్లో కుక్క కాటు ఘటనలు 1,771 నమోదు కావడంతో వీధి కుక్కలను షెల్టర్‌ జోన్లకు తరలించాలనే డిమాండ్‌ పెరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటామమని బల్దియా అధికారులు చెప్పడం గమనార్హం.

కానరాని చర్యలు..

నర్సంపేట మున్సిపల్‌ పరిధిలో 850 వరకు వీధి కుక్కలు ఉన్నాయి. తరచూ గుంపులుగా తిరుగుతూ జనంపై దాడిచేస్తున్నా నియంత్రించే దిశగా అధికారులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఈ కుక్క కాట్లు, భయానక ప్రాంతాలపై ఫిర్యాదు చేసేందుకు అంగడి సెంటర్‌ వెనకాల ఉన్న భవనంలో హెల్ప్‌ డెస్క్‌ ఉన్నా నగరవాసులకు తెలియక ఫిర్యాదులు చేయలేకపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు వీధి కుక్కలకు కుటుంబనియంత్రణతోపాటు రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాలని, డాగ్‌ షెల్టర్‌ జోన్‌ కూడా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 500కుపైగా వీధి కుక్కలు ఉన్నా.. నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి.

జిల్లా వ్యాప్తంగా పెరిగిన కుక్కల సంఖ్య

సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో

మళ్లీ చర్చ

కుక్కల తరలింపు కేంద్రం ఒకటే

ఉండడంతో హైరానా

షెల్టర్‌ జోన్‌లు పెంచాలంటే

బల్దియాపై అదనపు భారమే..

వరంగల్‌ జిల్లాలో

కుక్కకాట్లు 1086

Advertisement
 
Advertisement
Advertisement