సుందరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలి | - | Sakshi
Sakshi News home page

సుందరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలి

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

నర్సంపేట : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు భూక్య సమ్మయ్య, కొరబోయిన కుమారస్వామి పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సుందరయ్య వర్ధంతిని పట్టణ కార్యదర్శి, పదో వార్డు కౌన్సిలర్‌ హన్మకొండ శ్రీధర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మార్క్సిస్టు పార్టీ నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపారని, స్వాతంత్య్ర సమరంలోని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నమిండ్ల స్వామి, పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీది బాలకృష్ణ, ఎండీ ఫరీదా, వజ్జంతి విజయ, బుర్రి ఆంజనేయులు, లక్క రాజు, రుద్రారపు లక్ష్మి, ఉదయగిరి సరిత, గణిపాక విలియం కేరి, మోగులోజు శారద, దాసరి నరేష్‌, ఎల్లయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement