రైతులకు జీలుగ విత్తనాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

రైతులకు జీలుగ విత్తనాల పంపిణీ

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

ఖానాపురం : ప్రభుత్వం అందజేస్తున్న జీలుగ విత్తనాలను రైతులు వినియోగించుకోవాలని మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ శాఖమూరి హరిబాబు, నర్సంపేట ఆత్మ చైర్మన్‌ యడ్ల భిక్షంరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీలుగ విత్తనాలను చల్లుకోని నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. జీలుగ మొక్క దశలో ఉన్నప్పుడు భూమిలో కలియదున్నుకుంటే మంచి నత్రజని ఆధారిత ఎరువుగా ఉపయోగపడుతుందన్నారు. 30 కిలోల బస్తాకు రూ.2,452.50 చెల్లించి ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రంలో తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏఓ భోగ శ్రీనివాస్‌, విస్తరణ అధికారులు చందన, అంకుషావలీ, రైతులు దేవినేని వేణుగోపాల్‌రావు, శాఖమూరి ముఖేష్‌, చాగంటి వెంకటేశ్వర్లు, పరుచూరి రత్నాకర్‌రావు, పల్లేపాటి సీతారామరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement