నర్సంపేట : ఇంధనం ధరలు ఓ వైపు తగ్గించాలని ప్రజలు ఆందోళన చేస్తుండగానే మళ్లీ ధరలు పెంచడం దారుణమని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా నర్సంపేట డివిజన్ కార్యదర్శి అడ్డూరి రాజు మండిపడ్డారు. ఈ మేరకు పట్టణంలో మంగళవారం సమావేశం నిర్వహించగా ఆయన మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరలను మూడ్రోజుల క్రితమే రూ.3లు పెంచిన బీజేపీ ప్రభుత్వం మళ్లీ మంగళవారం పెట్రోల్, డీజిల్‌పై 90 పైసలు పెంచడం సరికాదన్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెంపుతో ఇబ్బంది పడుతున్న సామాన్యులు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతిపై మరింత భారం పడుతుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు బానోత్ జవహర్‌లాల్, దార లింగయ్య, సింగరబోయిన కట్టయ్య, పుల్లూరి మోహన్, ఎండీ ఖలీల్, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.


