పర్వతగిరి : మండలంలోని అన్నారం షరీఫ్ యాకూబ్‌బాబా దర్గా అభివృద్ధికి సహకరించాలని గ్రామ పంచాయతీ పాలక మండలి, వివిధ పార్టీల నాయకులు కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు కార్యాలయంలో మంగళవారం అన్నారం గ్రామ అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేసి పా లకమండలి, గ్రామంలోని వివిధ పార్టీ నాయకులతో కలిసి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యుబ్ ఆధ్వర్యంలో వక్ఫ్‌బోర్డు చైర్మన్ అజ్మతుల్లాను కలిశారు. అన్నార గ్రామంలో చేయాల్సిన పనులను వివరించి వినతిపత్రం అందజేశారు. సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, నాయకులు భిక్షపతి, రమేష్, వినయ్, పాలక మండలి సభ్యులు తదితరులు ఉన్నారు.


