నెక్కొండ : మొక్కజొన్నల కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) నర్సంపేట డివిజన్ నాయకుడు డాక్టర్ బోడ అనిల్‌నాయక్ ఆరోపించారు. మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. అనంతరం అనిల్‌నాయక్ మాట్లాడుతూ.. రైతుల నుంచి క్వింటాకు రూ.60 చొప్పున దళారులు దోచుకుంటున్నారని రైతులు తమ దృిష్టికి తీసుకు వచ్చారని తెలిపారు. వివిధ గ్రామాల రైతులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


