ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక పూజలు

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

వర్ధన్నపేట : వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాలో దుర్గమ్మ, ఎల్లమ్మ తల్లి పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మండల, పట్టణ, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మండల కమిటీ ఎన్నిక

దుగ్గొండి : ముదిరాజ్‌ మహాసభ మండల నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పల్లె రమేష్‌, ఉపాధ్యక్షులుగా ఓరుగంటి తిరుపతి, మంద యువరాజ్‌, గొర్రె రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా నేదురు రాజేందర్‌, కోశాధికారిగా సారా రాములు, సహాయ కార్యదర్శిగా చెలుకలపల్లి రాజయ్య, మేక రాజు, దండు రాజు, కార్యవర్గ సభ్యులుగా నీరటి మురళి, కీసరి ఎల్లయ్య, చాగంటి రాజు ఎన్నికయ్యారు.

ఉప సర్పంచ్‌ల ఫోరం మండల కమిటీ..

వర్ధన్నపేట : ఉప సర్పంచ్‌ల ఫోరం మండల నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కట్య్రాల ఉపసర్పంచ్‌ నాంపల్లి రవీందర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మ్యాకల దేవేందర్‌, భూక్య తిరుపతి, కార్యదర్శిగా ఆగపాటి రాజు, ప్రధాన కార్యదర్శిగా మంద రవి, కోశాధికా రిగా మెరుగు రమేష్‌, సలహాదారుడిగా సంకినేని గంగరాజును ఎన్నుకున్నారు. ఉపసర్పంచ్‌లు రాజేశ్‌, మహేందర్‌, మదార్‌, బుజ్జి, యా దగిరి, ఎల్లయ్య, స్రవంతి, అరుణ్‌ స్రవంతి, సుదర్శన్‌, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

హామీలు నెరవేర్చాలి

చెన్నారావుపేట : కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమ కారుల సంఘం రాష్ట్ర ప్రతినిధి ఆంగోత్‌ వీరాసింగ్‌ డిమాండ్‌ చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది త్యాగాలతోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందన్నారు. ఉద్యమకారులకు పింఛన్‌, 250 గజాల ఇంటి స్థలం, రెండు పడకగదుల ఇళ్లు, అర్హత కలిగిన వారికి ఉద్యోగం ఉవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసులు కాని వారికి సైతం ఈ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని డిమాండ్‌ చేశారు.

విజయవంతం చేయాలి

నర్సంపేట : నేటినుంచి నెల రోజుల పాటు నిర్వహించనున్న తెలంగాణ రక్షణ సేన పండుగను విజయవంతం చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తడిగొప్పుల మల్లేష్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నాయకుల సమావేశం కార్యక్రమానికి సంబంధించిన విషయాలు, భవిష్యత్‌ కార్యచరణ, నూతన కమిటీలపై చర్చించారు.

అవార్డు ప్రదానం

గీసుకొండ: గీసుకొండ మండలం బొడ్డుచింతలపెల్లికి చెందిన ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సామాజిక ఉద్యమకారుడు, మానవహక్కుల కార్యకర్త కేదాసి మోహన్‌ మానవ హక్కుల పరిరక్షణ(డిఫెండర్‌) అవార్డు–2026 పొందారు. సోమవారం సాయంత్రం గోవాలో ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఫెడరేషన్‌(ఐహెచ్‌ఆర్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐహెచ్‌ఆర్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు కొంగర అనిల్‌కుమార్‌, భారత ప్రభుత్వ ఎంహెచ్‌ఏ స్టాండింగ్‌ కౌన్సిల్‌ ప్రతినిధి డాక్టర్‌ రాగసందేశ్‌ తదితరులు మోహన్‌కు అవార్డు ప్రదానం చేశారు.

కార్మికుడి ఆత్మహత్య

చెన్నారావుపేట : బిహార్‌ రాష్ట్రానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు ప్రవీణ్‌కుమార్‌ (30) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రవీణ్‌కుమార్‌ నెలరోజులుగా మండల కేంద్రంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రెండ్రోజులుగా ఆరోగ్యం బాగాలేదని పనులకు రాకుండా అద్దె ఇంట్లోనే ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, వారి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement