వైద్యశిబిరం | - | Sakshi
Sakshi News home page

వైద్యశిబిరం

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

పర్వతగిరి : మండలంలోని రావూరు, నారాయణపురం గ్రామాల్లో మంగళవారం వైద్యాధికారి ఉదయ్‌రాజ్‌ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రావూరు, తండాలో 135 మందికి, నారాయణపురం, తండాలో 108 మందికి షుగర్‌, బీపీ, వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. డాక్టర్లు ఎం.యశస్విని, కె.రమ, హెచ్‌ఈఓ మూస, ఏఎన్‌ఎంలు ఉష, జ్యోతి, సామ్రాజ్యం, సుమలత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో అవినీతి

ఖానాపురం : ధాన్యం కొనుగోళ్లలో అవినీతి జరుగుతోందని మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసే క్రమంలో 44 కిలోలతో కాంటాలు వేస్తున్నారన్నారు. ఐకేపీ, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లే ధాన్యాన్ని దిగుమతి చేసుకునే క్రమంలో మిల్లర్లు ఇష్టారీతిన కోతలు విధిస్తూ రైతులను మోసం చేస్తున్నారని వివరించారు. కొనుగోళ్లు మొదలైన ప్రారంభ దశలోనే రైతులను ముంచి జేబులు నింపుకోవడం దుర్మార్గమన్నారు.అధికారులు, ఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే కొనుగోళ్లలో మోసాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

సంక్షేమ పథకాలు కేటాయించాలి

వర్ధన్నపేట : తమ గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు, పలు సంక్షేమ పథకాలు అధికంగా కేటాయించాలని నల్లబెల్లి సర్పంచ్‌ జక్కి అనితశ్రీకాంత్‌ రాష్ట్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని, అడ్లూరి లక్ష్మణ్‌ను మంగళవారం సచివాలయంలో కలిశారు.

నేడు ఇంటర్వ్యూలు

గీసుకొండ : మండలంలో ఎస్సీ కార్పొరేషన్‌ 2025–26 ఆర్థిక సంవత్సరానికి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నేడు (బుధవారం) మండల పరిషత్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ వి.కృష్ణవేణి తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఇంటర్వ్యూకు ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు. బ్యాంకు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.

అనుమతి లేని

వస్తువుల తయారీ

స్వాధీనం చేసుకున్న పోలీసులు

గీసుకొండ : గ్రేటర్‌ వరంగల్‌ 16వ డివిజన్‌ కీర్తినగర్‌ కాలనీలోని ఓ ఇండస్ట్రీస్‌లో బాదం సతీష్‌ అనే వ్యాపారి ఎలాంటి అనుమతి లేకుండా తయారు చేస్తున్న బ్లీచింగ్‌ పౌడర్‌, ఫినాయిల్‌, యాసిడ్‌, ఖాళీ కవర్లు, సంచులతో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ విశ్వేశ్వర్‌ తెలిపారు. మంగళవారం విశ్వసనీయ సమాచారం మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌ సింగారపు ప్రభాకర్‌ కొంతమంది సిబ్బందితో వెళ్లి తనిఖీ చేశారు. అదే సమయంలో సతీష్‌ పారిపోయేందుకు ప్రయత్నించాడు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

పేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌

నల్లబెల్లి : ేపదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌ నిలుస్తోందని కాంగ్రెస్‌ పార్టీ క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ మామిండ్ల రాజిరెడ్డి అన్నారు. మండలంలోని రుద్రగూడెం గ్రామానికి చెందిన పాకాల హేమలత, నూనావత్‌ రాజేందర్‌, అజ్మీరా కమల అనారోగ్య సమస్యలతో ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం పొందారు. అనంతరం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు మంజూరయ్యాయి. ఈ క్రమంలో వారికి రాజిరెడ్డి మంగళవారం చెక్కులు అందజేసి మాట్లాడారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం ద్వారా లబ్ధిచేకురేలా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని కొనియాడారు. కార్యక్రమంలో రుద్రగూడెం గ్రామ అధ్యక్షుడు అజ్మీరా తిరుపతి, నాయకులు గాదె కర్ణకర్‌, మాజీ ఉప సర్పంచ్‌ బైకాని శివకోటి, నాయకులు వక్కల అయ్యప్ప, గద్దల సురేష్‌, ఆకుల సందీప్‌, అజ్మీరా శ్రీలత రాజు, చింటు, అనిల్‌, లింగారెడ్డి, మోహన్‌ రెడ్డి, సదేవ్వరి బాలరాజు, జితేందర్‌, వక్కల రమేష్‌, అంబరగొండ రాజు, రాజేందర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement