వేలాడుతున్న విద్యుత్‌ వైర్లు | - | Sakshi
Sakshi News home page

వేలాడుతున్న విద్యుత్‌ వైర్లు

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

పర్వతగిరి : వేలాడుతున్న విద్యుత్‌ వైర్లతో ప్రమాదం పొంచిఉంది.. చేతికి అందే ఎత్తులో విద్యుత్‌ లైన్లు ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మండలంలోని రావూరు, కల్లెడ గ్రామాల్లో విద్యుత్‌ వైర్లు కిందికి వేలాడుతున్నాయి. దీంతో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పలుమార్లు విద్యుత్‌ శాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాలకు చెందిన వారు వాపోతున్నారు. రావూరు గ్రామంలోని ఇళ్ల మధ్య 33 కేవీ, కల్లెడలోని వ్యవసాయ పొలం వద్ద 11 కేవీ విద్యుత్‌ వైర్లు చేతులకు అందే విధంగా కిందికి ఉన్నాయి.

అధికారుల నిర్లక్ష్యం..

ఎప్పటికప్పుడు లూజ్‌ వైర్లను సరిచేయాల్సిన అధికారులు వాటిని పట్టించుకోకపోవడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా గతంలో మండలంలోని రా వూరు శివారు మోత్యా తండాలో షామియానాకు విద్యుత్‌ వైర్లు తగిలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల జరిగిన కల్లెడ మామిడితోటలో వి ద్యుత్‌ వైర్లు తగిలి ఓ బాలుడు అక్కడికక్కడే ప్రా ణాలు కోల్పోయాడు. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుండా ఉండాలంటే విద్యుత్‌ అధికారులు మా నిటరింగ్‌ చేసి తమ దృష్టికి వచ్చిన సమస్యలను ప రిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు.

ఇబ్బందులు పడుతున్న స్థానికులు

పట్టించుకోని అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement