పేదింటి ఆడబిడ్డల వివాహాలకు భరోసా | - | Sakshi
Sakshi News home page

పేదింటి ఆడబిడ్డల వివాహాలకు భరోసా

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

పర్వతగిరి : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు. మండలంలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల లబ్ధిదారులకు మంగళవారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తోందన్నారు. అనంతరం మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో మహిళలకు మంజూరైన క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్‌రావు, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌నాయక్‌, మాజీ జెడ్పీటీసీ సింగ్‌లాల్‌, ఏపీఎం రాజు, సర్పంచ్‌ చీదురు శంకర్‌, భూక్య మంజులశ్రీనివాస్‌, తహసీల్దార్‌ వెంకటస్వామి, ఎంపీడీఓ శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని చింతనెక్కొండలోని విజ్ఞాన భారతి విద్యాలయంలో చదివిన పదో తరగతి విద్యార్థులు మండల టాపర్లుగా నిలవగా ఎమ్మెల్యే వారిని సన్మానించి అభినందించారు. పాఠశాల కరస్పాండెంట్‌ అక్కినపెల్లి సతీష్‌కుమార్‌, పేరెంట్స్‌ కుడికాల శ్రీధర్‌, ఓరుగంటి రమేష్‌ పాల్గొన్నారు.

‘ఇందిరమ్మ’తో సొంతింటి కల సాకారం

ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల సాకారమవుతుందని ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు. మండలంలోని తూర్పుతండాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులకు దుస్తులు అందజేసి ఆశీర్వదించారు. అలాగే తూర్పుతండాలో దుర్గామాత బోనాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం ఐటీడీఏ నిధుల ద్వారా సుమారు రూ.4కోట్ల 14లక్షల వ్యయంతో గుగులోతుతండా నుంచి స్టేషన్‌ నెక్కొండ వయా తూర్పుతండా వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు

Advertisement
 
Advertisement
Advertisement