సాగులో శాసీ్త్రయ పద్ధతులు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

సాగులో శాసీ్త్రయ పద్ధతులు పాటించాలి

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

నర్సంపేట : రైతులు పంటసాగులో శాసీ్త్రయ పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్త డాక్టర్‌ దిలీప్‌కుమార్‌ సూచించారు. నర్సంపేట మండలం రాజుపేట గ్రామంలో జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ.. రైతులు యూరియా వినియోగం తగ్గింపు, నేల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేకంగా అవగాహన, అవసరం మేరకు మాత్రమే రసాయనాలను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పంటల మార్పిడి విధానం, సమతుల్య ఎరువుల వినియోగం, నీటి ఆదా పద్ధతులపై రైతులకు తెలిపారు. మార్కెట్‌కు అనుగుణంగా పంటల రకాల ఎంపిక చేసి అధిక ఆదాయం పొందే విధానాలపై సూచనలు చేశారు. మండల వ్యవసాయ అధికారి టి.కృష్ణకుమార్‌ మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి అబిద్‌ హుస్సేన్‌, మల్లయ్య, పాషా, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement