గురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
21 నుంచి 23కు!
పదో తరగతి ఫలితాల్లో పడిపోయిన జిల్లా ర్యాంకు
7
ముగ్గురు ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా
పదోన్నతి
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో హనుమకొండ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ గొర్ల సీతారెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సార్ల రాజు, ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఇన్‌స్పెక్టర్ బోలగాని శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు. పదోన్నతి పొందిన వారిని అధికారులు అభినందించారు.
ముగ్గురు పోలీసులపై వేటు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖ నిబంధనలకు వ్యతిరేకంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ, డబ్బు ఇవ్వని వారి ఇంటిపై దాడికి పాల్పడినందుకుగాను ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఎం.యాదగిరి, హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో మద్యం సేవించి నైట్ ఇన్‌చార్జ్ విధులు నిర్వహించినందుకు హెడ్ కానిస్టేబుల్ టి.రాములు, స్టేషన్ అధికారి ఇచ్చిన ఆదేశాలను అతిక్రమించినందుకు చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సతీశ్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
● 9,492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు.. 9,034 (95.25 శాతం) మంది ఉత్తీర్ణత
● గతంలో మాదిరిగానే ఈసారి బాలికలు ముందంజ
● కృష్ణాకాలనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ముదాసిర్‌కు
589 మార్కులు


