కలెక్టరేట్‌లో వైద్యశిబిరం | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో వైద్యశిబిరం

Apr 30 2026 8:13 AM | Updated on Apr 30 2026 8:13 AM

న్యూశాయంపేట: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టరేట్‌ అదికారులు, ఉద్యోగులకు బుధవారం వైద్యశిబిరాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశాల మేరకు కేఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి ప్రారంభించారు. సుమారు 80 మంది అధికారులకు వైద్య పరీక్షలు చేశారు. ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హరీశ్చంద్రారెడ్డి, ఆర్‌ఎంఓ డాక్టర్‌ అశ్విన్‌, వైద్యులు జటాధర్‌, మహేందర్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

శంకర్‌గౌడ్‌ ప్రాణత్యాగం వృథా కాదు

నర్సంపేట: శంకర్‌గౌడ్‌ బలిదానంతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చిందని, నర్సంపేట ప్రయాణ ప్రాంగణానికి కోల శంకర్‌ గౌడ్‌గా నామకరణం చేయాలని ఆర్టీసీ బాధిత ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గు రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. నర్సంపేట ఆర్టీసీ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన కోల శంకర్‌గౌడ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంకర్‌గౌడ్‌ ప్రాణత్యాగం వృథా కాదన్నారు. అనంతరం ముత్తోజిపేట గ్రామంలో శంకర్‌ కుటుంబాన్ని పరామర్శించి రూ.30 వేల ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ బాధిత ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జమాల్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాస్‌, కార్యదర్శి కంచర్ల స్టాలిన్‌, సంయుక్త కార్యదర్శి రేగుల్ల అశోక్‌, ఉపాధ్యక్షుడు లింగాల కిరణ్‌కుమార్‌, బాధ్యులు పర్వతాలు, మల్లికార్జున్‌, మల్లిక, శ్రీలత, శోభారాణి, రజిత తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బాధిత ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గు రాజేందర్‌

Advertisement
 
Advertisement
Advertisement