సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

Apr 30 2026 8:13 AM | Updated on Apr 30 2026 8:13 AM

అవగాహన సదస్సులో కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: సైబర్‌ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే దాని వెనుక దాగి ఉన్న ముప్పును గుర్తించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్‌ శంభునిపేట దూపకుంట రోడ్డులోని మైనారిటీ గురుకులంలో వేసవి శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు సైబర్‌ క్రైంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత వ్యక్తులతో స్నేహం చేయకూడదని కోరారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌, షాపింగ్‌ యాప్స్‌ వాడుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సైబర్‌ క్రైంపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. సదస్సులో జిల్లా అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జిల్లా అధికారులు పుష్పలత, భాగ్యలక్ష్మి, టి.రమేశ్‌, టెమ్రిస్‌ ఆర్‌ఎల్సీ జె.సతీశ్‌, ప్రిన్సిపాల్‌ నీలిమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement