అంబేడ్కర్‌ భవన నిర్మాణానికి విరాళం | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ భవన నిర్మాణానికి విరాళం

Apr 15 2026 7:20 AM | Updated on Apr 15 2026 7:20 AM

కాశిబుగ్గ: వరంగల్‌లో అంబేడ్కర్‌ భవన నిర్మాణానికి టీపీసీసీ లీగల్‌ సెల్‌ వైస్‌ చైర్మన్‌ నిమ్మాని శేఖర్‌రావు రూ.5లక్షల విరాళం ప్రకటించారు. మంగళవారం వరంగల్‌ కేఎంసీ ఎన్‌ఆర్‌ఐ భవనంలో జరిగిన అంబేడ్కర్‌ జయంతిలో భవన నిర్మాణానికి తన వంతు సహాయంగా రూ.5లక్షల విరాళం ప్రకటించడంతో కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద, ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అభినందించారు. ఈ సందర్భంగా శేఖర్‌రావును శాలువాతో సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, నాయకులు బిర్రు మహేందర్‌, మన్నె బాబురావు, చిలువేరు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ ఎస్‌ఈగా ఆనందం

హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌ వరంగల్‌ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌గా ఎ.ఆనందం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలో నలుగురు ఎస్‌ఈలకు స్థానచలనం కల్పిస్తూ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు వరంగల్‌ ఎస్‌ఈగా పనిచేస్తున్న కె.గౌతంరెడ్డి ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో ఆపరేషన్‌ జీఎం (ఓ అండ్‌ ఎం)గా బదిలీ అయ్యారు. సిరిసిల్ల ఎస్‌ఈగా పనిచేస్తున్న బేతి భిక్షపతిని ములుగు ఎస్‌ఈగా బదిలీ చేశారు. ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న వేణుమాధవ్‌ను సిరిసిల్ల ఎస్‌ఈగా బదిలీ చేశారు. ములుగు ఎస్‌ఈగా పనిచేస్తున్న ఆనందంను వరంగల్‌ ఎస్‌ఈగా బదిలీ చేయడంతో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతల స్వీకరణ

కాశిబుగ్గ: జిల్లాలోని అగ్నిమాపక కేంద్రంలో ఉన్నతాధికారుల పోస్టులు భర్తీ అయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్‌ నుంచి బదిలీపై వచ్చిన (డీఎఫ్‌ఓ) ఎ.యజ్ఞనారాయణ జిల్లా అగ్నిమాపక అధికారిగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నుంచి బదిలీపై వచ్చిన పి.వినోద్‌కుమార్‌ అగ్నిమాపక కేంద్ర అధికారి (ఎస్‌ఎఫ్‌ఓ) గా మంగళవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు ఉన్నతాధికారులను ఆఫీస్‌ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయం

కాళోజీ సెంటర్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరిక్ష ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులు కార్పొరేట్‌ స్థాయిలో మార్కులు సాధించడం ప్రశంసనీయమని వరంగల్‌ ఇంటర్‌ విద్యాశాఖ అధికారి డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ అన్నారు. సోమవారం జిల్లా ఇంటర్‌ విద్య కార్యాలయంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదంద్రులను శాలువా, మెమెంటోతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖానాపురం జూనియర్‌ కళాశాల విద్యార్థి ఎంపీసీ గ్రూప్‌లో 989/1000 మార్కులు సాధించి రాష్ట్ర స్ధాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు యశ్వంత్‌, అల్ఫియా ఆనం, జి.పల్లవి, నందినిని ప్రిన్సిపాల్స్‌ సంపత్‌కుమార్‌, శరదృతి తదితరులు ఉన్నారు.

వర్ధన్నపేటలో ‘న్యాయభోజ్‌’

వర్ధన్నపేట: డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ 135వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం వర్ధన్నపేట పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద మండల, పట్టణ కాంగ్రెస్‌ కమిటీల ఆధ్వర్యంలో ‘న్యాయభోజ్‌’ కార్యక్రమంలో భాగంగా వెయ్యి మందికి పైగా సహపంక్తి భోజనం మున్సిపల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు ఆదేశాల మేరకు అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని సహపంక్తి భోజనం ఏర్పాటు చేశామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement