అంబేడ్కర్‌ అందరికీ ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ అందరికీ ఆదర్శం

Apr 15 2026 7:20 AM | Updated on Apr 15 2026 7:20 AM

కాశిబుగ్గ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆలోచనలు అందరికీ ఆదర్శమని రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య అన్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా కాశిబుగ్గ సెంటర్‌లోని విగ్రహానికి సిరిసిల్ల రాజయ్యతో పాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద, ఎమ్మెల్యే నాగరాజులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ య్య మాట్లాడుతూ డాక్టర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగ పరిరక్షణకు చేసిన సేవలు ప్రతిఒక్కరికి మార్గదర్శకమన్నారు. అంబేడ్కర్‌ భవన నిర్మాణానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తానన్నారు. అనంతరం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలోని ‘ఆరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమంలో రోడ్డు భద్రత అవగాహనపై కలెక్టర్‌ సత్యశారద ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎండీ ఆయుబ్‌, అదనపు కలెక్టర్లు వైవీ గణేష్‌, సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఏసీపీ డాక్టర్‌ ఽశుభం ప్రీత్‌, గజ్జెల రాంకిషన్‌, జన్ను భాస్కర్‌, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య

ఘనంగా అంబేడ్కర్‌ జయంతి

నివాళులర్పించిన ఎమ్మెల్సీ సారయ్య, కలెక్టర్‌ సత్యశారద

Advertisement
 
Advertisement
Advertisement