● డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి
కాళోజీ సెంటర్: ప్రభుత్వం చెల్లింవాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం టీడీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం డి.మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ నివేదిక తెప్పించుకొని దానిని వెంటనే అమలు చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు వారి మూలవేతనంలో ఒక శాతాన్ని చందాగా స్వీకరించి హెల్త్ కార్డులను మంజూరు చేయాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలను ఏకమొత్తంలో చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఏ.శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.గోవిందరావు, ఉపాధ్యక్షుడు డి.రవీందర్, కార్యదర్శిలు ఎం.రామస్వామి, టి.సూరయ్య, ఆనంద చారి, నర్సింహులు, జాన్, రామ్‌రెడ్డి, కొమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


