దేశ ఐక్యతకు రాజ్యాంగమే ఆధారం | - | Sakshi
Sakshi News home page

దేశ ఐక్యతకు రాజ్యాంగమే ఆధారం

Apr 15 2026 7:20 AM | Updated on Apr 15 2026 7:20 AM

దేశ ఐక్యతకు రాజ్యాంగమే ఆధారం

హన్మకొండ : దేశ ఐక్యతకు రాజ్యాంగమే బలమైన ఆధారమని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ అన్నారు. సమాన హక్కులు, సామాజిక న్యాయం సాధనలో అంబేడ్కర్‌ పాత్ర అనిర్వచనీయమన్నారు. హనుమకొండలోని అంబేడ్కర్‌ భవన్‌లో షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్‌, అతిథులు రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య, ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ ఎండీ రియాజ్‌, గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, అదనపు కలెక్టర్‌ రవి, ప్రజా సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని బలపర్చేందుకు ఓటు హక్కు వినియోగించాలని పిలుపునిచ్చారు. ఆర్డీఓలు రాథోడ్‌ రమేశ్‌, డాక్టర్‌ కన్నం నారాయణ, డీఆర్‌డీఓ మేన శ్రీను, మెప్మా పీడీ జోనా, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, డీడబ్ల్యూఓ విశ్వజ, హౌసింగ్‌ పీడీ సిద్ధార్థనాయక్‌, మహనీయుల ఉత్సవ కమిటీ చైర్మన్‌ బండారి సురేందర్‌, నాయకులు మంద కుమార్‌, పుట్ట రవి, అంకేశ్వరపు రామచంద్రరావు, చుంచు రాజేందర్‌, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ ఆలోచనలు అందరికీ ఆదర్శం

కాశిబుగ్గ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆలోచనలు అందరికీ ఆదర్శమని రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య అన్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా కాశి బుగ్గ సెంటర్‌లోని విగ్రహానికి సిరిసిల్ల రాజయ్యతో పాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద, ఎమ్మెల్యే నాగరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. డాక్టర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగ పరిరక్షణకు చేసిన సేవలు ప్రతీ ఒక్కరికి మార్గదర్శకమన్నారు. అంబేడ్కర్‌ భవన నిర్మాణానికి ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తానన్నారు. అనంతరం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలోని ‘ఆరైవ్‌ –అలైవ్‌’ కార్యక్రమంలో రోడ్డు భద్రత అవగాహనపై కలెక్టర్‌ సత్యశారద ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆయూబ్‌, అదనపు కలెక్టర్లు వైవీ గణేశ్‌, సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఏసీపీ డాక్టర్‌ శుభంప్రీత్‌, గజ్జెల రాంకిషన్‌, జన్ను భాస్కర్‌, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌

Advertisement
 
Advertisement
Advertisement