హన్మకొండ : కరెంటోళ్ల సమ్మెతో కాంగ్రెస్ సర్కార్‌కు షాక్ తప్పదని బీఆర్‌ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ములుగు రోడ్డులోని ట్రాన్స్‌కో జోనల్ కార్యాలయం వద్ద విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె శిబిరాన్ని రాకేశ్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం బైక్ ర్యాలీ చేపట్టి అంబేడ్కర్ సెంటర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తొమ్మిది రోజులుగా ఆర్టిజన్ కార్మికులు సమ్మె చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులది కీలక పాత్ర అని కొనియాడారు. కొట్లాడి తెచ్చిన తెలంగాణలో అభివృద్ధి ఫలాలు ఉద్యోగులకు అందాలని చరిత్రలో ఎక్కడ లేని విధంగా అప్పటి సీఎం కేసీఆర్ పీఆర్‌సీ ఇచ్చారని గుర్తు చేశారు. కాంట్రాక్ట్ అన్న మాటే ఉండకూడదన్న సంకల్పంతో కాంట్రాక్ట్ ఉద్యోగాలను పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించి, వారికో గుర్తింపునిచ్చారని తెలిపారు. విద్యుత్ రంగంలో కాంట్రాక్టు ఉద్యోగులను 23 వేల మందిని ఆర్టిజన్ ఉద్యోగులుగా గుర్తించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఉద్యోగులకు, ఆర్టిజన్ కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విస్మరించిందని దుయ్యబట్టారు. విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగుల కన్వర్షన్ చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులతో వర్తింపజేస్తున్న సర్వీస్ రూ ల్స్ వీరికి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టిజన్ ఉద్యోగులు పాల్గొన్నారు.
మంత్రులు కొండా సురేఖ, సీతక్క
సమ్మె శిబిరానికి రావాలి
బీఆర్‌ఎస్ నాయకుడు రాకేశ్‌రెడ్డి


