ప్రణాళికాబద్ధంగా ‘అరైవ్‌–అలైవ్‌’ నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికాబద్ధంగా ‘అరైవ్‌–అలైవ్‌’ నిర్వహించాలి

Apr 15 2026 7:20 AM | Updated on Apr 15 2026 7:20 AM

ప్రణాళికాబద్ధంగా ‘అరైవ్‌–అలైవ్‌’ నిర్వహించాలి

వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు చేపట్టిన అరైవ్‌–అలైవ్‌ కార్యక్రమాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి గూగుల్‌ మీట్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశా నిర్దేశనం చేశారు. రోజువారీ షెడ్యూల్‌ ప్రకారం వారం రోజుల పాటు నిర్వహించాలన్నారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్‌, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

అగ్నిమాపక వారోత్సవాలు షురూ..

కాశిబుగ్గ : వరంగల్‌లోని అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం కాకతీయ వైద్య కళాశాల ఎన్‌ఆర్‌ఐ భవనంలో వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, అగ్నిమాపక శాఖ అధికారులు ఆవిష్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement