ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయం

Apr 15 2026 7:20 AM | Updated on Apr 15 2026 7:20 AM

ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయం

వరంగల్‌ డీఐఈఓ డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌

కాళోజీ సెంటర్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులు కార్పొరేట్‌ స్థాయిలో మార్కులు సాధించడం ప్రశంసనీయమని వరంగల్‌ ఇంటర్‌ విద్యాశాఖ అధికారి డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ అన్నారు. జిల్లా ఇంటర్‌ విద్య కార్యాలయంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను శాలువాలు, జ్ఞాపికలతో సోమవారం సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖానాపురం జూనియర్‌ కళాశాల విద్యార్థి ఎంపీసీలో 989/1000 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు యశ్వంత్‌, అల్ఫియా ఆనం, జి.పల్లవి, నందిని ని ప్రిన్సిపాల్స్‌ సంపత్‌కుమార్‌, శరదృతి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement