● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
● ప్రజావాణికి 166 అర్జీలు
న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చిన ప్రజల వినతులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ హాల్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులతో జూమ్ కాల్‌లో మాట్లాడి ప్రజల సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణికి మొత్తం 166 దరఖాస్తులు రాగా, అందులో రెవెన్యూశాఖకు 74, జీడబ్ల్యూఎంసీ 25, ఇతర శాఖలకు చెందిన 67 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


