ఆర్టిజన్లతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టిజన్లతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలి

Apr 14 2026 7:16 AM | Updated on Apr 14 2026 7:16 AM

ఆర్టిజన్లతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలి

యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ మన్నె శశికుమార్‌

కాజీపేట అర్బన్‌ : న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సమ్మెకు దిగిన ఆర్టిజన్‌ ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని బీఎంఎస్‌ అనుబంధ తెలంగాణ రాష్ట్ర పవర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ మన్నె శశికుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయం వద్ద కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు సోమవారం ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. ఐక్యంగా పోరాడితే ఫలితం తప్పకుండా వస్తుందని సూచించారు. కార్యక్రమంలో 327 యూనియన్‌ రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ ఇనుగాల శ్రీధర్‌, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement