హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణ ప్రజలనుంచి వినతులను స్వీకరించారు. మొత్తం 168 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆయా దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ శేషాద్రి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.


