మద్దతు ధర కల్పించేందుకే కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

మద్దతు ధర కల్పించేందుకే కేంద్రాలు

Apr 12 2026 2:54 AM | Updated on Apr 12 2026 2:54 AM

మద్దతు ధర కల్పించేందుకే కేంద్రాలు

వేలేరు: రైతులకు మద్దతు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగొలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం మండల కేంద్రంలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మొక్కజొన్న, ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొనుగొలు కేంద్రాల వద్ద టార్పలిన్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు మంచీనీరు, నీడ, వాచ్‌మెన్‌, లైటింగ్‌ సౌకర్యాలు ఏర్పాటు చేసేలా మహిళా సంఘాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. జూలై నాటికి మల్లన్న గండి ఎత్తిపోతల పైప్‌లైన్‌ పనులు పూర్తి చేసి చిల్పూరు, వేలేరు మండలాల రైతులకు సాగునీరు అందిస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, డీసీఓ సంజీవరెడ్డి, డీఎంఎస్సీ మహేందర్‌, తహసీల్దార్‌ హెచ్‌.కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న, సర్పంచ్‌లు బిల్లా యాదగిరి, అశోక్‌, మనోజ్‌, సాంబయ్య, రాజు, శ్రీనివాస్‌, ఐకేపీ ఏపీఎం అనిత, మండల సమాఖ్య అధ్యక్షురాలు ఆల్ల రేణుక, మాజీ ఎంపీపీ సమ్మిరెడ్డి, నాయకులు లక్ష్మణ్‌నాయక్‌, సద్దాం హుస్సేన్‌, మల్లికార్జున్‌, కత్తి సంపత్‌, శ్రీకర్‌, రమేశ్‌, నాగరాజు, రణధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Advertisement
 
Advertisement
Advertisement